అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు ముందుకు కదలకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫలితంగా ప్రగతి కుంటుపడి ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎంపి అర్వింద్ అన్నారు. ఆయన శనివారం మీడియా తో మాట్లాడారు.
మీనిధులు, మా నిధులు అంటూ సమయాన్ని వ్రుథా చేయొద్దని. పనులు చేయించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరి మీద వుందన్నారు .
కేంద్ర ప్రభుత్వమంజూరి చేసే నిధులను రాష్ట్రప్రభుత్వం దారీ మళ్ళిస్తుంది ఆయన మండిపడ్డారు . మాధవనగర్, అడవి మామడిపల్లి, ఆర్మూర్ మామిడిపల్లి ల వద్ద వంతెన పనులను వేగవంతం చేయించాలన్నారు.
నిజామాబాద్ – ఆర్మూర్ రోడ్డు విస్తరణ పనులను టీవీ సీరియల్ ను తలపిస్తున్నాయని విమర్శించారు.నిజమా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ విమర్శించారు. జిల్లాలోని అన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జిలో 100% గా కేంద్ర ప్రభుత్వాన్నిధులతోనే నిర్మిస్తున్నామని ఆయన పేరు.
కేవలం మాధవ్ నగర్ ఆర్ఓబి మాత్రమే కేంద్ర రాష్ట్ర నిధులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఓబి పనులలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పనులను ముందుకు సాగించాలని ఆయన సూచించారు. నూతన ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు తరగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని అన్నారు.
అలాగే బోధన కు చెందిన ఆర్ఓబి నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సమయానికి ప్రారంభించి,సమయానికి పూర్తి చేస్తుందని చెప్పారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తుందని ఇప్పటి జిల్లాకు మంత్రి పదవి రాలేదని ఎద్దేవా చేశారు.జిల్లాకు కేవలం ఇన్చార్జి మంత్రి ఉన్న నామమాత్రంగానే ఉన్నారని ఆయన 6 నెలలకొకసారి వస్తారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి పై దృష్టి పెట్టాలని కోరారు. గత ప్రభుత్యం మాదిరి కాకుండా ఆర్ఓబి కి నిధులు మంజూరు చేయాలని కోరారు.
అలాగే ఈ దిశ సమావేశంలో ముఖ్యంగా విద్యకు సంబంధించిన 20కోట్ల రూపాయలతో జిల్లాలో 40 స్కూల్ లను ఎంపిక చేసి ఆ నిధులను ప్లే గ్రౌండ్, బాత్రూం,ల్యాబ్ లా అభివృద్ధి కోసం ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అమృత్ స్కీం కింద నిజామాబాద్ కి 217 కోట్లు, ఆర్మూర్ కి 43 కోట్లు, బోధన్ కి 50 కోట్లు, భీంగల్ కి 25 కోట్లు, మొత్తం జిల్లాకు 330 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అలాగే అటవీ, కాంపా నిధులు, పీఎం విశ్వకర్మ దరఖాస్తులు, గ్రామీణ సడక్ యోజనకు సంబంధించి పనులపై రివ్యూ చేశామని వివరించారు.
ఆయా పనులకు సంబంధించి నివేదికలను తమకు అందజేయాలని కలెక్టర్ కు సూచించామన్నారు.
ఈ సమావేశంలో నిజామాబాద్ దర్బార్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
