HomeTelanganaNizamabadజూపల్లి జాడేది …జిల్లా వైపు కన్నెత్తి చూడని ఇంచార్జి మంత్రి ……రగులుతున్న ఎమ్మెల్యే లు ……దిశ...

జూపల్లి జాడేది …జిల్లా వైపు కన్నెత్తి చూడని ఇంచార్జి మంత్రి ……రగులుతున్న ఎమ్మెల్యే లు ……దిశ మీటింగ్ లో ప్రస్తవన……..నిధులు లేక నిలిచిన పనులు..కుంటుపడుతున్న గ్రామ ప్రగతి

  • పరుగులు పెట్టాల్సిన ప్రగతి నత్తకే నడక నేర్పిస్తుంది …..దాదాపు పది మాసాల క్రితం కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రజల్లో గంపెడు ఆశలు ఉండే ఆరు గ్యారెంటీ లతో పాటు నియోజకవర్గాల్లో అనేక ప్రగతి పనులు ఇక పరుగులు పెడతాయని అంతా భావించారు సర్కార్ సైతం ఆ దిశగానే కార్యాచరణ మొదలు పెట్టింది కానీ అది ఆరంభ శూరత్వమే అయింది జిల్లాలోఅభివృద్ధి సంక్షేమ పథకాల పర్యవేక్షణ ను ఇంచార్జి ..
  • మంత్రి లకు నెత్తిన పెట్టింది. ఇందులో భాగంగా పాలమూరు జిల్లాకు చెందిన ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ను నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గా నియామకం అయ్యారు. మూడో రోజే ఆయన జిల్లాకు ఎంట్రీ ఇవ్వడంతో అధికారుల్లో సహజంగానే అటెన్షన్ మొదలైంది. కానీ ఆ తరవాత కథ షరా మాములే అయింది.
  • ఈ పది మాసాల్లో ఆయన జిల్లాకు వచ్చింది రెండేసార్లు. అదికూడా పూర్తీ స్థాయిల్లో రివ్యూ జరగలేదు జస్ట్ పరిచయాలకే పరిమితం అయింది. ఇందిరమ్మ ఇల్లు …కొత్త రేషన్ కార్టు….హెల్త్ కార్డు లాంటి ప్రతిష్టాత్మ కార్యాలలో ఇంచార్జి మంత్రే కీలకమని ప్రభుత్వం చెప్తుంది.
  • కానీజిల్లా ఇంచార్జి మంత్రి తీరు ను చూసి అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ క్యాబినెట్ లో జిల్లా మంత్రి లేకుండా పోయారు.
  • ఈ తరుణంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేయాల్సిన ఇంచార్జి మంత్రి అడ్రస్ లేకుండా పోయారు. కనీసం ఆయన జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకులకు సైతం అందుబాటులో వుండడం లేదనే విమర్శలున్నాయి.
  • ఈపాటికే ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జరిగిన దిశా మీటింగ్ వేదికగా ఇంచార్జి మంత్రి మీద బీజేపీ ఎమ్మెల్యే లు నిప్పులు చెరిగారు. ఎంపీ అర్వింద్ సెటైర్లు కూడా వేశారు.జిల్లాకు మంత్రి పదవీ కూడా ఇవ్వక పోవడం ఇంచార్జి మంత్రి పట్టించుకోక పోవడం వల్ల ప్రగతి పనులు ఆశించి స్థాయిలో ముందుకు సాగడంలేదని ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు ఆవేదన వ్యక్తం చేసారు. .
  • జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి జిల్లాలో నెలకొన్న సమస్యలపై సమీక్షించకపోవడం, అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లోపం కారణంగా సమస్యలు ఎక్కడికి అక్కడే ములుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాడి తప్పిన పాలనతో ప్రజల అనేక అవస్థలు పడుతున్నారు.
  • ఇటీవల కాలంలో రైతు రుణమాఫీ అమలు కాలేదని పెద్ద మొత్తంలో రైతులు ఆర్మూర్ వేదికగా ఆందోళనలు చేపట్టినప్పటికీని ఇన్చార్జి మంత్రి జూపల్లి కనీసం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
  • మరోవైపు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామాలు నిధులు లేక సమస్యలతో విల విలలాడుతున్నాయి. ఎప్పుడో ఓసారి వచ్చి చుట్టపు చూపుగా మీటింగ్ లో పాల్గొనడం తప్ప, ప్రజల మౌలిక వసతుల కల్పన, ప్రధాన సమస్యలపై ఇన్చార్జి మంత్రి దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి.
  • ఇటీవల కాలంలో జిల్లాలో నిర్వహించిన సమీక్ష సమావేశాలకు కూడా ఇన్చార్జి మంత్రి హాజరు కాకపోవడంతో పాలన వ్యవస్థ అంతుచిక్కని స్థితికి మారిపోయింది.
  • నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా బోధన్ సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డి, బిజెపి ఎమ్మెల్యేలుగా నిజామాబాద్ అర్బన్ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు ఉండగా, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ తరఫున వేముల ప్రశాంత్ రెడ్డి లు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు.
  • అయితే నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావును నియమించినప్పటికిని, ఆయన జిల్లా వైపు కన్నెత్తి చూడకపోవడం, మంత్రి కానీ మంత్రిగా జిల్లా పరిపాలన అధికారులతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.
  • గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోగా, కొత్త పనులు కూడా చేపట్టే అవకాశం లేకుండా పోయిందని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు అంటున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది కోట్లు కేటాయించింది.
  • అయితే వీటిలో ప్రధానంగా తాగునీరు, విద్య, పారిశుద్ధ్యం, రోడ్లు, భవనాలు ఇతర అభివృద్ధి పనులు కోసం నిధులను వెచ్చించాల్సి ఉంది, ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇన్చార్జి మంత్రి సమీక్షించి పనులు ఖరారు చేయాల్సి ఉంటుంది.
  • స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల ప్రతిపాదనలు పంపే విషయంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ఇంచార్జీలతోపాటు ఎమ్మెల్యేలకు మధ్య అంతరాయము కనబడుతోంది. అంతేకాకుండా కొత్తగా మంజూరైన పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి కనబడుతోంది.
  • నిధులు లేక నిరసించిన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటిలపై ఇప్పటికైనా ఇన్చార్జి మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments