విద్యుత్ ఘాతం తో కౌలు రైతు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఎడపల్లి మండలంలోనీ తనకాలన్ కు చెందిన గోవురు పోశెట్టి(43). గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు.
ఈ మేరకు పందుల బెడద కోసం పొలం చుట్టూ విద్యుత్ తెగలను అమర్చాడు. ఈ మేరకు రోజు వారీగా విద్యుత్ సరఫరా నిపేందుకే వెళ్ళే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ తీగలపై పడడంతో విద్యుత్ ఘాతం తగిలి మృతి చెందినట్లు తెలిపారు.
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వంశీకృష్ణ రెడ్డి పేర్కొన్నారు.
