చికిత్స పొందుతూ మృతి…ఒంటికి నిప్పంటించుకుని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు.
ఈ ఘటన రూరల్ మండలంలోని చోటు చేసుకుంది. వివరాల వెళ్లితే… ముభారక్ నగర్ కు చెందిన శ్రీహరి(48).కూలీ పనులు చేసుకుంటారు.గత సంవత్సరం క్రితం కాలని విషయంలో కళావతి తో శ్రీహరికి గొడవ జరిగింది.
ఈ మేరకు వారు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అప్పటి నుంచి తరుచూ కోర్టు చుట్టూ తిరుగుతూన్నారు.
ఈ మేరకు ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి చెందాడు. ఈ కోర్టు వ్యవహారంలో తీవ్ర మనస్థాపానికి గురై శ్రీహరి ఈనెల 25 న ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఇంటికి నిప్పంటించుకుని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
