HomeCRIMEఅన్న అంత్యక్రియలను నిరాకరించిన సోదరుడు...

అన్న అంత్యక్రియలను నిరాకరించిన సోదరుడు…

నిజామాబాద్ నగరంలో అన్న అంత్యక్రియలను తన ఇంటి ముందు చేయదంటూ ఓ తమ్ముడు నిరాకరించాడు. నగరంలోని ఆర్యనగర్ కు చెందిన వెంకట నారాయణ గౌడ్ గత ఐదు సంవత్సరాల క్రితం తన తమ్ముడు నాగేశ్వరావు గౌడ్ తో ఆస్తి తగాదాలు జరిగాయి.

ఈ ఆస్తి తగదలలో కుల పెద్దమనుషులు కూర్చొని మాట్లాడారని సమాచారం. ఆస్తి తగాదాల విషయంలో వెంకట నారాయణ గౌడ్ తన భార్య, పిల్లలతో కలిసి వేరే చోటు జీవనం గడుపుతున్నారు.

ఈ మేరకు గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఫీవర్ బాధపడుతున్నాడు. దాంతో వెంకట నారాయణ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. వెంకట నారాయణ మృతి చెందడంతో ఆర్య నగర్ లోని తన స్వంత ఇంటికి భార్య పిల్లలు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న తమ్ముడు నాగేశ్వర్రావు,తల్లి కలసి మా ఇంటి ముందు అంత్యక్రియలు నిర్వహించకూడదని వాదనకు దిగారు.

ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వెంకట నారాయణ భార్య, పిల్లలు అక్కడే ఇంటి ముందు కూర్చున్నారు. అందుకు కుల పెద్దలు చెప్పిన అందుకు నాగేశ్వర్రావు నిరాకరించడంతో గొడవకు దారి తీసింది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఇద్దరినీ మెప్పించే ప్రయత్నం చేశారు.

ఈ మేరకు వెంకట్ నారాయణ ప్రస్తుతం ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్న యజమాని అంత్యక్రియలకు సమ్మతించి మృతదేహాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్న ఇంటికి తీసుకోని వెళ్ళారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments