HomeTelanganaNizamabad4న జిల్లాకు టీపిసిసి అధ్యక్షుడు రాక...రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి...

4న జిల్లాకు టీపిసిసి అధ్యక్షుడు రాక…రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి…

టీపిసిసి అధ్యక్షుడి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అక్టోబర్ 4 న జిల్లా కు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఘన స్వాగతం తెలపాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్ ఎస్ యు ఐ తో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మహేష్ కుమార్ గౌడ్ అంచులంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎదగడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు.

అక్టోబర్ 4 న నిర్వహించే బహిరంగ సభకు ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టాన నాయకులు కూడా ఆయనతోపాటు వస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సభను కాంగ్రెస్ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గ నుండి అధిక సంఖ్యలో ప్రజలను ఈ కార్యక్రమాన్ని కి హాజరయ్యేలా చూడాలని ఆయనపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు మూడు వేలమంది రావాలని నియోజక వర్గ ఇంచార్జి లను కోరారు. అలాగే భవిష్యత్తులోపార్టీలో మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట వెయ్యను ఉందని చెప్పారు.

అలాగే ఆర్మూర్,బాల్కొండ నియోజక వర్గ ప్రజలు నేరుగా పాత కలెక్టర్ మైదానంలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

అలాగే బోధన్, నిజామాబాద్ రూరల్, అర్బన్,ప్రజలు నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ తరువాత సమావేశానికి హాజరు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ వినయ్ రెడ్డి, గడుగు గంగాధర్,బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి,తాహిర్బీన్ హంధాన్ ,నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ వేణు, నరాల రత్నాకర్, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments