జాతిపిత జయంతి నాడు మద్యంఅమ్మకాలతో పాటు జంతు వధ పైనా నిషేధం. గాంధీ జయంతి ని అందరూ ఘనంగా జరుపుకుంటారు.
ఆయన విగ్రహాలకు పోటాపోటీగా వెళ్ళి పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. ఎలాగో సెలవు రోజు కావడంతో ఇంటికి వెళ్లి సేద తీరుతారు.
కానీ ఆయన జయంతి నాడు నిషేధచట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. కనీసం ఈ ఒక్కరోజైనా మద్యం మాంసం అమ్మకాలను కట్టిడి చేయలేక యంత్రాంగం నిస్సహాయంగా ఉండడం ఫై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
సరే జిల్లాలో మారుమూల ప్రాంతాల విషయంలో కట్టిడి చేయడం దుస్సాధ్యమే కావచ్చు. కానీ యావత్తు యంత్రం లో క్రియాశీలకంగా పనిచేసే ఉన్నత స్థాయి అధికారులుండే జిల్లా కేంద్రంలో నిషేధ చట్టం ను ఉల్లగిస్తుంటే ఎలా ? బుధవారం ఎలాగో పిత్రమావాస్య కావడంతో పెద్దలకు బియ్యం ఇచ్చే పక్రియ లో మాంసం మద్యం అనివార్యం కావడం తో విక్రయ దారులు ఎప్పటిలాగే దందా ను సాగించారు. ఇంకా చెప్పాలంటే
ఈ రోజు నిర్ణిత సమయానికి ఓ రెండు గంటల ముందే మద్యం మాంసం అమ్మకాలు మొదలు పెట్టారు. నిషేధం వంక చెప్పి బ్లక్ దందా కు తెరలేపారు. మున్సిపల్ కమిషనర్ ….కలెక్టర్ ….పోలీస్ కమిషనర్ ఆబ్కారీ డీసీ లు ఉండే కార్యాలయాలకు నివాస సముదాయాలకు కూత వేట దూరంలోనే అమ్మకాలు జరుగుతున్నాయంటే ఎలా ?
ఏదో మొక్కుబడిగా గాంధీ విగ్రహాలకు దండలు వేసి ఫొటోలు దిగడం తోనే బాధ్యత అయిపోతుందా ? ఇలాంటి వ్యవహారాల్లో కఠినంగా ఉండి తమకున్న అధికారం తో కట్టడి కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలి కదా ? గాంధీ కి దండలు వేయడానికి పోటీ పడిన వారే మద్యం మాంసం కోసం ఎగబడ్డారు ఇదెక్కడి విడ్డురమో ?
