HomeCRIMEఇద్దరు బైక్ దొంగలు అరెస్టు.. 5 బైక్ లు రికవరీ...

ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు.. 5 బైక్ లు రికవరీ…

ఇద్దరు బైక్ దొంగలను పట్టుకుని 5 బైక్ లను రికవరీ చేసినట్లు సీసీఎస్ పోలీసులు, రెండవ టౌన్ పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే .

శనివారం నగరంలోని సీసీఎస్, రెండవటౌన్ పోలీసులు నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో వాహనాల తనీఖీలు నిర్వహిస్తుండగా నగరంలోని డైరీ పారంకు చెందిన నీల నర్సింహ, మోపాల్ మండలం ముదక్ పల్లికి చెందిన ఫేరోజ్ ఖాన్ లు బైక్ పై వెలుతుండగా పట్టుకుని పాత్రలు చూపియ్యమని అడగగా వారి వద్ద బైక్ కు సంబందించిన పేపర్ లు లేకపోవడంతో దానిని దొంగ బైక్ గా నిర్ధారించారు.

వారిని పట్టుకుని విచారించడంతో ఐదు బైక్ లు రికవరీ అయినట్లు తెలిపారు. వాటిలో 1,2,4,5పోలీస్ స్టేషన్ ల పరిధిలో చోరికి పాల్పడ్డవి గుర్తించినట్లు తెలిపారు.

ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రెండవ టౌన్ ఎస్ఐ యసీర్ ఆర్ఫత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments