నిజామాబాద్ నగర శివారులోని జాతీయ రహదారిపై మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న మహాలక్ష్మి ఇండస్ట్రీస్ పై పోలీసులు దాడి చేసి డీసీఎం లోడు చేసిన పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం దాడి నిర్వహించి డీసీఎం నిండా ఉన్న పిడిఎఏస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత బియ్యం ఎక్కడినుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సంబంధిత శాంపిల్ సర్వే కోసం వెళ్లినట్లు సమాచారం. ఎంత మేరకు పట్టుకున్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
