మాజీ సీఎం కెసిఆర్ ఎమ్మెల్యే గా పోటీచేసిన కామారెడ్డి లో మున్సిపల్ ఛైర్మెన్ పదవీ చేజారి పోయింది. చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం శనివారం నెగ్గింది. అవిశ్వాస కు బిఆర్ యస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే మద్దతూ ఇవ్వడంతో బిఆర్ యస్ అనూహ్యంగా ఛైర్మెన్ పదవీ కోల్పోయింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టూ జాహ్నవిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన కాపీని జిల్లా కలెక్టర్‌కు అందజేశారుదీంతో శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జాహ్నవి పై అవిశ్వాస బలపరీక్షని ఏర్పాటు చేయడంతో కౌన్సిలర్లు నేరుగా క్యాంపుకు తరలి వెళ్లారు.. నేరుగా 27 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బిర్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు..
అలాగే బిఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో వచ్చారు.. బలపరీక్ష ఎన్నిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవి పై అవిశ్వాసం నెగ్గింది.
అవిశ్వాసం నెగ్గడంతో మున్సిపల్ ఇన్చార్జ్ చైర్మన్‌గా గడ్డం ఇందూ ప్రియని నియమించారు.. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ అటు నుంచి గోవా క్యాంపునకు తరలించారు. 30వ తేదీ బలపరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తం 37 మంది చైర్మన్‌పై అవిశ్వాసంకు అనుకూలంగా ఓటేశారు.
అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి పంపించి అక్కడినుండి గెజిట్ వచ్చిన తర్వాత మున్సిపల్ నూతన చైర్ పర్సన్ ఎన్నిక ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.కామారెడ్డి మున్సిపాల్టీ లో 49 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ 27, టీఆర్ఎస్ 16,
బీజేపీ 06 మంది ఉన్నారు.
/////// షబ్బీర్ అలీ తో చేతులు కలిపిన బిఆర్ యస్ నేత ? కామారెడ్డి మున్సిపాలిటీ లో అవిశ్వాస రగడ బిఆర్ యస్ లో చిచ్చురేపుతుంది. ఎమ్మెల్సీ కవిత కు అత్యంత సన్నహితుడిగా గత పదేళ్లుగా చెలామణి అయిన నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ తో చేతులు కలిపి అవిశ్వాస కథ నడిపారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ పక్షాన ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసిన సదురు నేత ఓటెద్దు పోకడలు వివాదాస్పదమ అయ్యాయి
