ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మోర్తాడ్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మండలానికి చెందిన ఎర్ర గంగాధర్(27).
వృత్తి రిత్యా గురువారం చేపలు పట్టి విక్రయించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
