రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన అంకాపూర్ రైల్వే పరిదిలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అంకాపూర్ రైల్వే రైల్వే బ్రిడ్జి వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు మృతిని వివరాలు తెలిసిన వాడు 8712658591 రైల్వే ఎస్ఐ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
