విద్యుత్ చార్జీలు పెంచే కుట్రకు రేవంత్ సర్కార్ తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో గురువారం విద్యుత్ చార్జీల పెంపుపై నిర్వహించిన బహిరంగ విచారణ కు బిఆర్ యస్ ప్రశాంత్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ బృందం హాజరు అయింది .అనంతరం ప్రశాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
వ. రూ.10గా ఉన్న చార్జీని రూ.50కి పెంచాలని నిర్ణయించారని,దీనివల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని . 300 యూనిట్లకుపైగా విద్యుత్ ను వినియోగించే వారికే పెంపు వర్తిస్తుందని అంటున్నారని, కానీ ఈ వినియోగం అందరికి మామూలు విషయమేనని పేర్కొన్నారు. .
చార్జీల పెంపు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పరిశ్రమలు మూతపబడితే లక్షలాది మంది రోడ్లపై పడుతారన్నారు. సిమెంట్, స్టీల్ తదితర వాటి ధరలు పెరిగి మళ్లీ సామాన్యులకు తీవ్ర భారం పడుతుందన్నారు.
గతంలో చార్జీలు పెంచుతామని డిస్కంలు విన్నవిస్తే సీఎం హోదాలో కేసీఆర్ తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంచితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన స్పష్టం చేశారు
