ఒంటికి నిప్పంటించుకుని మహిళా మృతి చెందిన ఘటన బోధన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… బోధన్ నగరంలోని వీక్లీ మార్కెట్ కు చెందిన రామవ్వ (50).
ఈనెల 3న దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
