రైలు నుంచి జారిపడే వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.
బిక్నూర్ మండలం అంతం పల్లి గ్రామానికి చెందిన జీడి సిద్దయ్య 58 ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని తన సోదరుడు ఇంటికి రైలులో వెళ్ళాడు. సిటీ సమీపంలో రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.
హుటాహుటిన ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
