ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటడగా డీఈవో ను గురువారం ఏసీబీఅధికారులు గురువారం రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. సీనియారిటీ జాబితా లో చేర్చాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. కానీ రూ 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ ని ఆశ్రయించారు.
ఈ మేరకు గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.
