HomeCRIMEద్విచక్ర వాహనం పై నుంచి కింద పడి యువకుడు దుర్మరణం...

ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడి యువకుడు దుర్మరణం…

ద్విచక్ర వాహనం పై నుంచి కింద పడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన మాక్లూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన బట్టు శ్రీకాంత్ (28).

సంవత్సరంనర క్రితం వివాహమైంది. వృతి రీత్యా ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు లో క్లీనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం విధులు అనంతరం జన్నపల్లి నుంచి ధర్మోరా కు వెళ్ళే మార్గ మధ్యంలో చిక్లి గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments