అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తో స్నేహం ఉన్నాసరే ప్రజల్లో పట్టు కొనసాగించే వ్యూహంలో యం ఐఎం ఉంది. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా యంఐయం నిజామాబాద్ నగరంలో పార్టీ ని మరింత బలోపేతం చేసే దిశగా ఆపార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది.
ఈ మేరకు నేరుగా దారుస్సలామే రంగంలోకి దిగింది.దాదాపు నాలుగేళ్ళ తర్వాత అధినేత హాసదొద్దీన్ ఒవైసీ సైతం నిజామాబాద్ నగరంలో పర్యటించి వెళ్లారు. కీలక నేతలకు తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలో దిశా నిర్దేశం చేసారు.
ఆయన పర్యటన తర్వాత ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సహం కనిపిస్తుంది.వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సానుకూల పలితాలు సాదించాలనే పట్టుదలతో దారుస్సలాం ఉంది. ఇందులో భాగంగానే మైనార్టీ ఏరియా ల్లో ప్రధాన సమస్యల మీద ఫోకస్ పెట్టారు. మరో వైపు మైనార్టీ ల్లో పట్టు ఉన్న నేతలను సైతం పార్టీలోకి తెచ్చే పనిలో పార్టీ నాయకత్వం ఉంది.
ఇటీవలే కీలక నేత ఫయాజ్ పార్టీ లో చేరగానే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ను రాబోయే రోజుల్లో క్రియ శీలకంగా ఉండాలని పురమాయించారు. మైనార్టీ ఏరియాల్లో ప్రధాన సమస్య ల పరిష్కారం కోసం పనిచేయాలనే పట్టుదలతో ఆపార్టీ నేతలు ఉన్నారు.
ఇటీవల భారతి రాణి నగర్ లో పేదల ఇండ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు.గతంలో అదికార పార్టీలో ఉన్న నేతలు పేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇక్కడే స్థలాలు కట్టబెట్టారు.
ఇవేవి పట్టించుకోని అధికారులు అక్రమ నిర్మాణాలంటూ పేదల ఇండ్లను కూల్చివేయడం ఫై విమర్శలు వెలువెత్తాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ నేతలను సైతం ఇరకాటంలో పడేశాయి. ఇండ్లు కోల్పోయిన వారికి సమీపంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలనే డిమాండ్ ను తెరమీదికి తెచ్చారు.
నిర్మాణాలు పూర్తీ అయి ఏళ్లతరబడగా వృధా ఉన్న ఇండ్లను పేదలకు కేటాయించాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం అధికారులను పట్టుబడుతున్నారు. కానీ ఈ ఇండ్లను ఏక పక్షంగా ఇవ్వడానికి వీలు లేదని అర్హులైన పేదలకు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ సైతం ఒత్తిడి చేస్తున్నారు.
దీనితో ఈ ఇండ్లను ఎవరికి కేటాయించాలనే విషయంలో యంత్రాంగం తర్జన భర్జనలు పడుతుంది. ఈ నేపథ్యంలో యంఐయం ఎంట్రీ ఇచ్చింది. కూల్చివేతలో ఇండ్లు కోల్పోయిన పేదలకు ఈ ఇండ్లను కేటాయించాలని హాసద్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసారు. ఆ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి అదే కోరారు.
అవసరం అయితే పేదల పక్షాన ఆందోళనకు దిగుతామని జిల్లా అధ్యక్షుడి ఫయాజ్ స్పష్టం చేశారు. మరో అయిదారు మాసాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో యంఐయం ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలని భావిస్తుంది. వరుసగా రెండు పర్యాయాలు 15 డివిజన్ లను గెలుస్తుంది.
బిఆర్ యస్ తో దోస్తీ ఉన్నాసరే మున్సిపల్ ఎన్నికల్లో రెండు సార్లు ఒంటరిగానే బరిలోకి దిగి అనూహ్య ఫలితాలు సాధించింది. మైనార్టీలో తిరుగులేని ఆధిపత్యం చాటుకుంది.
ఈసారి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ కు అనుకూలంగాలోకసభ ఎన్నకల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసి ఆ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగే యోచనలో ఉంది.
