ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, కనీసం సెక్రెటరీలు జిల్లాలోని పాఠశాలు కూడా సందర్శించడంలేదని హాస్టల్లో వార్డెన్ లు వాచ్ మెన్ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి విమర్శించాడు.
బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి మరియు మంత్రుల దృష్టికి తీసుకెళ్తమని ఆయన పేర్కొన్నారు.
శనివారం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..
వరుస సంఘటనలు జరిగిన కూడా ప్రభుత్వానికి విద్యార్థుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి గానీ మంత్రులు గాని ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టకపోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు.
ఇక హాస్టల్స్ కి నిత్యవసర సరుకులు సరఫరా చేసేవారికి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తలేరని పేర్కొన్నారు.
మా ప్రభుత్వంలో కేసీఆర్ 9000 పోస్టులు భర్తీ చేస్తే ఈరోజు కేవలం 5000 మందిని తీసుకొని మిగతావి బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచారు.. విద్యార్థులకు సంవత్సరానికి రెండు యూనిఫామ్ లు ఇవ్వాలి కానీ ఈరోజు ప్రభుత్వం ఒకే యూనిఫామ్ ఇస్తుందని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్రను మాని గురుకుల పాఠశాలు పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, కునాల్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
