HomeTelanganaNizamabadబిసిటియు నూతన కార్యవర్గం ఎన్నిక....

బిసిటియు నూతన కార్యవర్గం ఎన్నిక….

బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాడవేడి వినోద్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీటీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర సలహాదారు రమణస్వామి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ప్రధాన కార్యదర్శిగా ఆర్ గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా కె. రవికుమార్, కె. రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా కే బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఏ మోహన్, ఉపాధ్యక్షులుగా యు విజయ్ కుమార్, ఎం మహేందర్, డి శ్యాంప్రసాద్, జె శ్రీనివాస్, మహిళా ఉపాధ్యక్షురాలిగా బి ప్రతిభ, 20 స్వప్న, కోశాధికారిగా డి. రాజు, కార్యదర్శులుగా పి చంద్రశేఖర్, టి. వినోద్ కుమార్, ఎం మాణిక్యం, ఎస్ సతీశ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ననుగొండ విజయలక్ష్మి, గౌరవ సలహాదారులుగా కొట్టూరు రమేశ్, వై సత్యనారాయణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మేడిదాల ప్రవీణ్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అంబటి నర్సయ్య, వంగ శ్రీహరి, శ్రీనివాసరాజు,రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా బి కళ్యాణి, ఎ. సబిత, రాష్ట్ర కార్యదర్షులుగా జి కృష్ణాజి, ৯০. వేణుగోపాల్, రాష్ట్ర గౌరవ సలహాదారులుగా టి రమణ స్వామి, ఏ శంకర్, డి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ… మళ్లీ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నుకున్న జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన పిఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, బిసి ఉద్యోగుల కు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జనాభా దామాషా ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు అమలు చేయాలని, 4 పెండింగ్ డిఏ లను కూడా అమలు చేయాలని, గురుకుల ఆదర్ష పాఠశాల, కెజిబివి ల సమస్యలను పరిష్కరించాలని, బిసి లకు క్రమిలేయర్ విధానాన్ని తొలగించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments