తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యం బోధన్ పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది
ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ లో స్వాతి ప్రియ ఆత్మహత్యపై బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ…స్వాతి ప్రియ చావుకి కారకులు ఎవరు అని ఆయన అన్నారు దానికి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటిస్వాతి ప్రియ ఒక టాప్ స్టూడెంట్ గా ఉండి, మానసికంగా దృఢంగా ఉండలేకపోవడం ఏంటి?
విద్యార్థులు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు దారి తీస్తున్నారువిద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించాలి వారికి మనో ధర్యం ఇవ్వాలి ..ఇది నిజంగా ఆత్మహత్యేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గత 10 సంవత్సరాల్లో బాసర ట్రిపుల్ ఐటీ లో 27 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న గత 2 సంవత్సరాలలో 9 మంది దాంట్లో 8 మంది మహిళలే ఉన్నారు పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఏమి జరుగుతోంది?
విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలకు ఎందుకు వస్తున్నారురాజకీయ నాయకులకు యూనివర్సిటీలలో ప్రవేశం ఉంటే, విద్యార్థి నాయకులకు ఎందుకు అనుమతించరు దాని వెనుక గల కారణాలు ఏమిటి విద్యార్థి నాయకులని అనుమతించాలి అప్పుడే విద్యార్థుల సమస్యలు బయటికి వస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాష్ట్ర ప్రభుత్వం చేప్పాలి
స్వాతి ప్రియకు న్యాయం జరుగాలని, ఈ విషయం పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి అని అన్నారు విద్యార్థుల మానసిక భద్రతకు గట్టి చర్యలు గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యార్థులు పట్ల ఇలానే వ్యవహరిస్తే తాప్పకుండా ప్రభుత్వాన్ని దింపడానికి పునర ఉద్యమిస్తాం అని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, ప్రసాద్,దత్తు తదితరులు పాల్గొన్నారు
