HomeLaw and Orderకోర్టు కేసుల పరిష్కారంలో న్యాయవాదులు మరింత చేయుతనివ్వండి..జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల.........

కోర్టు కేసుల పరిష్కారంలో న్యాయవాదులు మరింత చేయుతనివ్వండి..జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల………

బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కక్షిదారులకు మెరుగైన న్యాయసేవలు అందించడం జరుగుతున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.

న్యాయమూర్తులు,న్యాయవాదులు మరింత శ్రమిస్తే కక్షిదారులకు న్యాయఫలాలు మరిన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె న్యాయవాదుల సమావేశంలో మాట్లాడారు.

కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్ధుల ఆశలకు అనుగుణంగా కష్టిద్దామని అన్నారు.న్యాయవ్యవస్థ పనితీరులో పారదర్శకత ఎంతో ఉన్నదని,దానిని కాలానికి ,సమయానికి అనుగుణంగా మార్చుకుని.సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.

ప్రజలకు అన్ని రాజ్యాంగ వ్యవస్ధలకంటే న్యాయవ్యవస్థ పైనే ఎక్కువగా ఆధారపడుతారని,ఆ నమ్మకాన్ని దిగ్విణీకృతం చేద్దామని జిల్లాజడ్జి ఆశించారు. భారత సుప్రీంకోర్టు,తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దిగువ కోర్టులపై చాలా ఆశలు పెట్టుకున్నాయని ,ఇక్కడ నే కోర్టుకేసులు పరిష్కారం అయితే ఎంతోమేలు కక్షిదారులకు చేసినవారం కాగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యాయమూర్తులు, న్యాయవాదులు మరింత ఎక్కువగా కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేస్తే కోర్టులలో విచారణ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వెలుసుబాటు లభిస్తుందని న్యాయవాదుల సహకారంతో గత మూడు సంవ్సరాలుగా జిల్లా ప్రజలకున్యాయ సేవలను అందిస్తున్నట్లు జిల్లాజడ్జి సునీత అన్నారు.

బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద సమాజం ఎల్లప్పుడు ప్రజలకు మెరుగైన, త్వరితగతిన న్యాయసేవలు అందించడానికి అవిరల కృషి చేస్తున్నదని తెలిపారు.జిల్లా ప్రజలకు జిల్లా న్యాయవ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుతామని,కోర్టులలో న్యాయమూర్తుల కొరత,సిబ్బందికొరత ఉన్న చాలా కోర్టు కేసులు అనుకున్న దానికంటే ఎక్కువగానే పరిష్కారం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి తెలిపారు.

సమావేశంలో అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు,జూనియర్ సివిల్ జడ్జి లు ఖుష్బూ ఉపాధ్యాయ్, హరికృష్ణ, హరి కుమార్, చైతన్య, బార్ ఉపాఢ్యక్షుడు పెండెమ్ రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొంన్పాల్ సురేష్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments