పశువుల పాక లో ఉన్న అవును గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట్ కు చెందిన సాకలి కాంతమయ్యకు చెందిన ఆవును గుర్తుతెలియని ఆగంతకులు వచ్చి రాత్రి గొడ్డలితో మెడ భాగంలో నరికి చంపారు.
ఉదయం వచ్చి యజమాని చూడగా ఆవు రక్తపు మడుగులో ఉండడం చూసి బోరున విలపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లింగం పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
