ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందారు .హార్వెస్టర్‌ను కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన హార్వెస్టర్ యజమాని గంగారాం తీవ్రంగా గాయపడగా నిజామాబాద్ కి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
