HomeTelanganaNizamabadరైతులను, వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే ప్రభుత్వంకు బుద్దిచెప్తం - 12వేల జీవనభృతి సాధనకోసం పోరాడుదాం- రైతులందరికి...

రైతులను, వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే ప్రభుత్వంకు బుద్దిచెప్తం – 12వేల జీవనభృతి సాధనకోసం పోరాడుదాం- రైతులందరికి రుణమాఫీచేయాలి- రైతుభరోసాను తక్షణమే అందివ్వాలి – అఖిలభారత ప్రగతి శిల రైతు సంఘం డిమాండ్..

రైతంగాన్ని, వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వంకు బుద్దిచెప్తం అని, రైతులకు, వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలపుకొని హామిలను అమలు చేయాలని

అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం డిమాండ్ చేసింది , రైతులకు రైతుభరోసా, బోనస్, వ్యవసాయ కార్మికులకు 12వేల జీవనభృతి అమలు చేయాలని లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు సోమవారం నాడు అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (AIPKS), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) ఆధ్వర్యంలో రైతులు, జిల్లా కలెక్టర్ కార్యాలయం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఆతరువాత జిల్లా కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా –

అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (AIPKS) రాష్ట్ర ప్రధానకార్యదర్శి V. ప్రభాకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి P. రామకృష్ణలు మాట్లాడుతు:

ప్రభుత్వం అనేక హామీలను రైతులకు వ్యవసాయ కూలీలకు ఇచ్చి ఇప్పుడు అమలు చేయడంలో మీనా వేషాలు లెక్కిస్తుందన్నారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరము గడుస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు.

అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి ఉండగా కేవలం సన్నవడ్లకే ఇస్తామని మాట తప్పరన్నారు. ఇప్పటికే రెండు పంటలు ముగిసిన ఇప్పటికీ రైతు భరోసా కు అతీలేదు గతి లేదన్నారు.

దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని వీరికి ఏడాది పొడవున వ్యవసాయంలో పని దొరకటం లేదని, పని దొరికిన దినాలలో తక్కువ ఆదాయం వస్తుందని దీనివలన విద్య, వైద్యం, తలదాచుకోవడానికి గూడు లేక జంతువుల మాదిరిగా బతుకుతున్నారని అన్నారు పుట్టిన పిల్లలకు పౌష్టిక ఆహారం లేక తగినంత బరువు లేక శరీరంలో కావాల్సిన రక్తం లేక వారి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు లంకె బిందెలు ఉంచాడేమోనని అనుకున్న కానీ ఖజానంత ఖాళీ చేసి పోయాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం సరైనది కాదని.

ధనిక రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం అన్న కేసీఆర్ గారు తన పాలనలో వ్యవసాయ కూలీలకు చేసింది శూన్యమేనని దేశవ్యాప్తంగా 14 కోట్ల వ్యవసాయ కూలీలకు కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ పాలనలో వ్యవసాయ కూలీలకు చేసింది ఏమీ లేదని.

ఒకరిపై ఒకరు చమత్కారాలు సెల్ ఒక్తులతో కూలీలను మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలకి 4000 రూపాయలు ఇస్తానని హామీ ప్రకారం అంటే సంవత్సరానికి 45 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

తక్షణమే వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (AIPKS) రాష్ట్ర సహాయ కార్యదర్శి B. దేవారం, రాష్ట్ర ఉపాధ్యక్షులు K. గంగాధర్, జిల్లా అధక్ష, కార్యదర్శులు S. సురేష్, గుమ్ముల.గంగాధర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIKMS) జిల్లా అధ్యక్ష,కార్యదర్షులు T. సాయన్న, G. కిషన్, ప్రసంగించగా అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (AIPKS), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIKMS) రెండు సంఘాల జిల్లా డివిజన్, మండల నాయకులు R రమేష్ పుట్టి. నాగన్న, P. రాజేశ్వర్, నశిర్,K. రాజేశ్వర్, G. నడ్పేన్న,R. దామోదర్, B. బాబన్న, B. కిశోర్, G కిషన్, M అనిస్,G. సాయిరెడ్డి, M. లింబన్న, K. ఆశిస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments