HomeTelanganaNizamabadసామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆర్ నాంపల్లి...

సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆర్ నాంపల్లి ఆగ్రహం

సామాజిక న్యాయం కోరలేని వారు అంబెడ్కర్ వారసులు ఎలా అవుతారని ఎమ్మార్పీయస్ నేత నాంపల్లి మండిపడ్డారు. మాల మహానాడు నేతల వాదనలు పస లేనివని బాధ్యత లేనివన్నారు ఆయన సోమవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఉప వర్గీకరణ చేయరాదని ఎక్కడా లేదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు ఆర్టికల్ 341 ఎస్సీ జాబితాలో ఉన్న వారిని తొలగించాలన్న లేదా కొత్తవారిని చేర్చుకోవాలన్న 341 ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది కానీ మాలలు 341 ఆర్టికల్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని అందరం కలిసి సమన్యాయం కోసం పోరాడుదామని మాట్లాడుతున్నారు వారి దృష్టిలో సమ న్యాయమంటే అందరిదీ కొందరే అనుభవించాలని వారు కోరుకుంటున్నారు ఇదేనా అంబేద్కర్ ఇజం అంటే ఆర్టికల్ 14 15 16 లో వెనుకబడిన అత్యంత వెనుకబడిన వారికి రాజ్యాంగ పలాలు అందినప్పుడే రాజ్యాంగ స్పూర్తి అని రాజ్యాంగ పలాలు చిట్టచివరి మానవుడికి అందినప్పుడే ప్రజాస్వామ్యం స్ఫూర్తి అని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు మందకృష్ణ మాదిగ బీసీలలో ఏ బి సి డి ఉన్నట్లుగానే షెడ్యూల్డ్ కులాల్లో కూడా వారి జనాభా ప్రాతిపదికన ఏ బి సి డి కావాలని ఉద్యమం చేసి 2000 సంవత్సరంలో సాధించడం జరిగింది. కానీ కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకు వెళ్లి 2004 నవంబర్ 5న రద్దు చేపియ్యడం జరిగింది.

అంబేద్కర్ వారసులం అనే వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని అనేక వేదికలపై చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడం లేదో వారు చెప్పాలి మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తే ఆ సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎలా అంబేద్కర్ వారసులు అవుతారో చెప్పాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆర్ నాంపల్లి డిమాండ్ చేశారుకర్ణాటక రాష్ట్రంలోని క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కార్గే గారి కూతురు తీర్మానానికి అనుకూలంగా సంతకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని తెలపడం జరిగింది

కార్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా మేము వర్గీకరణ కు కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. ఈరోజు మందా కృష్ణ మాది గారిపై దుష్ప్రచారం చేస్తున్న అంబేద్కర్ వాదులమనేవారు మందకృష్ణ మాదిగ ఈ రాష్ట్రంలో సుబ్బండ కులాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ దేశంలో అనేక కుల సంఘాలకు ఆదర్శమయ్యాడు ప్రమోషన్ లో రిజర్వేషన్స్ సాధించాడు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ సాధించారు ఆరోగ్యశ్రీ రావడానికి కారణం మందకృష్ణ 2004 నవంబర్ 5న వర్గీకరణ రద్దు చేసితీర్పు వెలుబడిన మరుసటి రోజు నుండే అమలు చేయడం జరిగింది కానీ ఆగస్టు ఒకటిన తీర్పు వెలబడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు

నిండు అసెంబ్లీలో మాదిగలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన ఇంతవరకు అమలు కాకపోవడం చాలా బాధాకరం ఇప్పుడైనా వర్గీకరణ జరిగే వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండాలని వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారత దేశ ప్రధానమంత్రిగా గౌరవనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాల స్థితిగతులపై లోకూర్ కమిషన్ వేయడం జరిగింది

ఆ కమిషన్ షెడ్యూల్డ్ కులాల స్థితిగతులపై అధ్యయనం చేసి మాల సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితా నుండి తొలగించాలని అప్పుడే రిపోర్టు ఇవ్వడం జరిగింది మేము నిజమైన అంబేద్కర్ వారసులం కాబట్టే ఆ రిపోర్ట్ పైన పోరాటం చేయకుండా ఎవరి జనాభా ప్రకారం వారికి ఎస్సీ లో ఉన్నటువంటి అన్ని కులాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కోరుకున్న వాళ్లు నిజమైన అంబేద్కర్ వాదుల లేదా సామాజిక న్యాయానికి కట్టుబడని వార కేవలం ఒకే వర్గానికి రిజర్వేషన్లు కావాలనే వాళ్ళు అంబేద్కర్ వాదుల సమాజం గుర్తించాలని నాంపల్లి కోరారు ఈ సమావేశంలో సల్లూరి శ్రీనివాస్ పోశెట్టి గణేష్ రవి సాయిలు రాజయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments