తెలంగాణా తల్లి కొత్త విగ్రహం కాంగ్రెస్ చెయ్యి గుర్తు తల్లి, కానీ తెలంగాణ తల్లి కాదని విమర్శించాడు. తెలంగాణ మీద, కేసీఆర్ మీద ద్వేషభావాన్ని పెంచుకొని తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగుతున్నది. ఉద్యమ స్ఫూర్తితో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లిగా మార్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ వీజి గౌడ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ఈ దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందన్నారు.కోట్లాది మంది బిడ్డల్లో స్ఫూర్తిని నింపిన తల్లి రూపాన్ని మార్చడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కాంగ్రెస్ తల్లి’ విగ్రహ రాజకీయానికి నిరసనగా భారాస ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చెప్పారు.
మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీర, పంచామృత అభిషేకాలు నిర్వహించారు..అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
సోమవారం నూతన సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాదని విమర్శించాడు,కాంగ్రెస్ పార్టీ తల్లి అను ఎద్దేవ చేశారు. ఎంతో మంది ప్రణత్యాగలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి గుర్తుగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమనపరిచేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న వేళ.. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలిచేందుకు 2006లో వెలిసింది తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహంలో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలగలిసి ఉన్నాయి. తెలంగాణ మూలాలూ ఉన్నాయి.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలనే ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకం. ఆ పండుగను ప్రతిఫలించేలా బతుకమ్మను ఎత్తుకున్న మాతృమూర్తిలా తెలంగాణ తల్లి రూపం ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది. 18 ఏండ్లుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిగా స్థిరపడింది.
అలాంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణ తల్లి రూపాన్నే మార్చడంపై తెలంగాణ తల్లి అవమానించాడమేనని ఆయన ధ్వజమెత్తారు.తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ చెయ్యి గుర్తును ప్రచారం చేసే తల్లిలా, కాంగ్రెస్ ప్రచారాస్త్రం అభయహస్తంలా ఉండేలా రూపుమార్చారని భగ్గుమన్నారు.
చెయ్యి గుర్తుకోసం పెట్టిన తల్లి ప్రతిమ అని విమర్శించారు. ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? పార్టీకో తల్లి ఉంటుంది కానీ ప్రభుత్వానికో తల్లి ఉంటుందా? అని ప్రశ్నించారు.కిరీటం దైవత్వానికి ప్రతీక, భక్తికి ప్రతీరూపంగా భావించడం ఆనవాయితీగా వస్తున్నది.తల్లిని దైవంగా భావిస్తే అనాదిగా దేవుళ్లకు కిరీటాలే ఉంటాయి.
భారతమాత, తెలుగుమాత, అంతకుముందు ఆంధ్రామాత, ఏ రాష్ట్రమాతకైనా కిరీటమే ఉన్నదని తెలిపారు.తెలంగాణ తల్లి సంస్కృతికి చిహ్నంగా బీఆర్ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టు చీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు ఉండేవి.
కోహినూర్ వజ్రంతో కిరీటంతో పాటు వడ్డాణం, జరీ అంచుచీర, నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పట్లో తీర్చిదిద్దారు. తెలంగాణ బతుకును ఆగం చేసే కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందని ధ్వజమెత్తుతున్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్,మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
