విధి నిర్వహణలో ఉండగా దొరికిన బ్యాగును బాధితులకు అందజేసి పోలీసులు నిజాయితీ చాటుకున్నారు. ఈ నెల 7 న జిల్లా కోర్టు చౌరస్తా లో ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా రూ 2000 విలువ గల నిత్యవసర సరకుల సంచి పడిపోగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు లభించింది.
వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సీసీ కెమెరాల ద్వారా పరిశీలించగా సంచిలో పాత బిల్ చిట్టి ద్వారా సదరు వ్యక్తి కి సమాచారం అందించారు.మంగళవారం బడుతునికి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ దొరికిన బ్యాగును అందజేశారు.
