డ్రంకన్ డ్రైవ్ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా..
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ అంగూర్ రాకేష్, ఉప్పరి గోపాల్ లను మంగళవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ అంగూర్ రాకేష్ కు రెండు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అలాగే ఉప్పరి గోపాల్ కు ఒక్క రోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
