నగరంలోని రూరల్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. రూరల్ ఎస్ఐ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.
కంటేశ్వర్ బైపాస్ రోడ్డు పక్కన ఉన్న అశోక్ రెసిడెన్సీ లో కొత్వాల్ రత్నాకర్, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 23 న ఇంట్లో నుంచి కిరణ దుకాణం కు వెళ్తున్నానని చెప్పి వెళ్ళినాడు.
తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
యువకుని ఆచూకీ తెలిసిన వారు 8712659849,8712659847 ఫోన్ చేసి సమాచారం అందించాలని రూరల్ ఎస్ఐ ఆరీఫ్ పేర్కొన్నారు.
