HomeCRIMEఅదృశ్యమైన వ్యక్తి విగత జీవిగా..

అదృశ్యమైన వ్యక్తి విగత జీవిగా..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ టౌన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమై శవమై కనిపించాడు. ఈ ఘటన నగరంలో బుదవారం చోటు చేసుకుంది.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నసురుల్లాబాద్ బొమ్మదేవుపల్లి గ్రామానికి చెందిన మాగిడి కృష్ణ గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారని పేర్కొన్నారు.

ఈ మేరకు ఈ నెల 24 న ఇంట్లో నుంచి బోర్ మరమ్మత్తులు చేస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదని చెప్పారు. బుదవారం నగరంలోని లలిత మహల్ థియేటర్ పక్కన ఉన్న అక్షిత పకోడా దుకాణం ముంది మృతి చెంది ఉన్నట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments