HomeCRIMEనేరాల నియంత్రణకు కృషి చేయాలి..నిజామాబాద్ ఇంచార్జీ సీపీ సింధూశర్మ..

నేరాల నియంత్రణకు కృషి చేయాలి..నిజామాబాద్ ఇంచార్జీ సీపీ సింధూశర్మ..

నేరాల నియంత్రణకు అందరూ కృషి చేయాలని అందుకోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ కమీషనర్ పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఈ కొత్త సంవత్సరంలో సిబ్బంది అందరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని అందుకోసం ఒక ప్రణాళికను రూపొందిచుకొని నేరాల నియంత్రణ కోసం ప్రతీ సిబ్బంది తమ పై అధికారుల సూచనలను తూ.చ తప్ప కుండా పాటించాలని తెలియజేశారు.

ప్రధానంగా చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రధానదృష్టి సారించాలని, కోర్టు కేసుల విషయంలో త్వరితగతిన స్పందించాలని, పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పర్చాలని, నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, ప్రొబేషనరి ఐ.పి.యస్. సాయికిరణ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సి.యస్.బి, సి.సి.ఆర్.బి, సి.సి.ఎస్, సైబర్ క్రైమ్, సి. టి. సి ఎ.సి.పిలు మరియు సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments