పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ప్రజలకు చేరువయ్యేందుకు, తమ పనితీరును మరింత మెరుగు పరుచుకునేందుకు పోలీసు QR కోడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధు శర్మ తెలిపారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారు తమ మొబైల్ ద్వారా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే పోలీసు సేవల పట్ల ఎంత వరకు సంతృప్తి చెందారు ? పోలీసుల పనితీరుపై ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాల సేకరణ చేయనున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు దారులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరో అందుకోసం క్యూఆర్ కోడ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ QR కోడ్ పద్దతిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 9న రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి ప్రారంభించనున్నట్లు బుధవారం ఇంచార్జ్ సీపీ సిహెచ్.సింధుశర్మ వెల్లడించారు.
ఈ QR కోడ్ వలన పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారని, ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు QR కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి సీపీ కోరారు.
