గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా అంకెల గారడి ప్రదర్శించారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమయం వృధా చేస్తున్నారన్నారు. మహిళలకు, వికలాంగులకు పెంచుతామన్న పింఛను మాటే తీయలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్సీ కొరకు నిధులు కేటాయించలేరని చెప్పారు.
ఇప్పటికే హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ప్రభుత్వం..ఇప్పుడు అంకెల గారడీతో మళ్ళీ మోసం చేసిందన్నారు. వీరికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.
స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తానంటూ రెండేళ్లుగా విస్మరిస్తున్నారని, రాష్ట్రంలో కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేరని తెలిపారు.
రెండేళ్లుగా సిడీపీ కింద రావాల్సిన నిధులే ఇవ్వలేదని, ఇక ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయిస్తామంటే ఎలా నమ్ముతారన్నారు. ప్రస్తుత బడ్జెట్ పరిశీలిస్తే పేపర్ మీద గ్రాండ్ గా ఉందని కానీ గ్రౌండ్లో మాత్రం బ్లాంక్ గానే ఉందన్నారు.
