HomeCRIMEచిప్స్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా బిక్కనూరు:

చిప్స్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా బిక్కనూరు:

చిప్స్ లోడ్ తో వెళ్తున్న లారీ 44వ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన గురువారం సాయంత్రం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామం వద్ద చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్ నుండి నిజామాబాద్ వైపు చిప్స్ లోడుతో వెళ్తున్న లారీ భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి రోడ్డుకు పక్కనున్న రైలింగ్ను ఢీకొంటూ వెళ్ళి బ్రిడ్జి పై నుండి కిందకి జారుతూ బోల్తా పడింది.

అందులో ఉన్న డ్రైవరు గాయాల బారిన పడడంతో ఆసుపత్రికి తరలించగా, ట్రీట్మెంట్ అనంతరం డ్రైవర్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments