HomeTelanganaNizamabadకారేగాం తాండా అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ గారు ఆకస్మికంగా...

కారేగాం తాండా అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ గారు ఆకస్మికంగా సందర్శించారు.

కారేగాం తాండా అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ గారు ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కేంద్రంలో అందుబాటులో ఉన్న పాల ప్యాకెట్లు మరియు బాల అమృతం స్టాక్‌ను పరిశీలించారు.

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహార పదార్థాల నాణ్యత, సరఫరా స్థితిని ఆయన సమీక్షించారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

అలాగే, గర్భిణీలు మరియు బాలింతలకు అందించే సేవలను మరింత మెరుగుపరచాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు పూర్తిగా చేరవేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తారా చంద్, వార్డు సభ్యులు బలరాం నాయక్, వెంకటేష్ అంగన్వాడీ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments