గేదెను కారు ఢీకొని ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు ఈ ఘటన పిట్లంలో మండల కేంద్రంలో శనివారం జరిగింది .పిట్లం జాతీయ రహదారి (161) పై శనివారం రాత్రి వేగంగా వస్తున్న ఓ కారుకు గేదెలు అడ్డువచ్చాయి. దీంతో ఓ గేదెను ఢీకొన్న కారు పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వారిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు
