ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన మాక్లూర్ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..ఆర్మూర్ లోని పేర్కిట్ గ్రామానికి చెందిన సుమన్ (37). నిజామాబాద్ నగరంలోని తూనికల కొలతల విభాగంలో పనిచేస్తున్నారు.
గురువారం రాత్రి విధులు ముగించుకుని తన బైక్ పై ఇంటికి వెళ్తుండగ రామచంద్ర పల్లి ప్రాంతంలో 63వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఓ కారు వెనుకనుంచి ఢీ కొనడంతో వ్యక్తికి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
