Tuesday, April 21, 2026
HomeCRIMEఫైనాన్స్‌ వేధింపులు తాళలేక.. చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య..

ఫైనాన్స్‌ వేధింపులు తాళలేక.. చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య..

ఫైనాన్స్‌ వేధింపులు తాళలేక.. చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..నగర శివారులోని నెహ్రూ నగర్ కు చెందిన షేక్ ఖయ్యూం (48). భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గత మూడు సంవత్సరాల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ లో ఇంటిపైన మడీగేజ్ లోన్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతనికి పక్షవాతం వచ్చి మంచానికి అంకితం అయ్యాడని తెలియారు.

గత మూడు నెలలుగా ఫైనాన్స్ కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటికి వచ్చి ఫైనాన్స్ కట్టని యెడల ఇంటిని జప్తి చేస్తానని బెదిరించడంతో ఖంగుతిన్నారు.

ఈ మేరకు సదరు వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక ఈ నెల 16 న ఇంటి నుంచి ఎవ్వరికీ చెప్పకుండా బయటకి వెళ్ళిపోయాడు.కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.పక్కనే ఉన్న అశోక్ సాగర్ గట్టు పైన అతని చెప్పులు,చొక్కా కనిపించడంతో చెరువులో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది.

పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీస్ లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!