తెల్లవారు జామున వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ రైతు ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఎదురయ్యింది.ఈ విషాద ఘటన ఆర్మూర్ పట్టణం పెర్కిట్ వద్ద జాతీయ రహదారి మీద జరిగింది. .పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
