తెలంగాణ రాష్త్రం ఏర్పాటు అయ్యాక భారీ ఎన్ కౌంటర్ జరిగింది. రెండు రాష్ట్రలకు సరిహద్దులో ఉండే ములుగు జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది.ములుగు జిల్లాలోని చల్పాక సమీపంలోని అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు. మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. మృతుల్లో కీలక మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. . ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
