గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల కాకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకొని వచ్చాయి….
వేల మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో అటు విద్యార్థులు ఇటు కళాశాలల సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.
గత సంవత్సర కాలం నుండి సిబ్బంది జీతభత్యాలు కూడ చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.భవనాల అద్దెలు కూడ చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మరియు కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నుండి యాజమాన్యాలు పాల్గొన్నారు. వారిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, సూర్యప్రకాష్, శంకర్, నరాల సుధాకర్, బాలాజి, గురువెందర్, దత్తు శ్రీనివాస్, అరుణ్, రమణ, సుజన్, భూమయ్య, యూనుస్, సాజన్, నవీన్, గిరి, రాజేందర్, గంగారెడ్డి, చందన్, సత్యం, రవి పటేల్ , తదితరులు పాల్గొన్నారు
