బిఆర్ యస్ పార్టీకి మళ్ళీ వలస ల బెడద మొదలైంది. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం బాల్కొండ లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.అదికూడా పార్టీ అధినేత కెసిఆర్ అంతరంగికుడు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న బాల్కొండలో మరోసారి వలసలు మొదలు కావడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశం అయింది.
భీమ్‌గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత భర్త సురేందర్ తో పాటు మోర్తాడ్ మాజీ ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్ లు శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రిసుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఇద్దరు బలమైన బిసి నేతలు ఒకేసారి పార్టీ ని వీడడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి వీరిద్దరూ గతంలో కాంగ్రెస్ లో నే సుదీర్ఘ కాలం పనిచేసినవారే.
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కి బినామీ గా పదేళ్లు అనేక కాంట్రక్టు పనులు చేసిన రమేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పలితాలు వచ్చిన నెలరోజులకు తిరుగుబాటు జెండా ఎత్తాడు. డీసీసీబీ ఛైర్మెన్ గా ఉన్న పోచారం భాస్కర్ రెడ్డి మీద అవిశ్వసం పెట్టి డీసీసీబీ పీఠం చేజిక్కించుకున్నారు.
ప్రశాంత్ రెడ్డి అంతరంగికుడిగా ముద్ర వేసుకొని పదేళ్లు హవా చెలాయించిన రమేష్ రెడ్డి తిరుబాటు చేయడం ఫై పోచారం రగిలిపోయారు. తెరవెనుక ప్రశాంత్ రెడ్డి చక్రం తిప్పాడంటూ పోచారం స్వయంగా కెసిఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రశాంత్ రెడ్డి ప్రమేయం వుండదని కెసిఆర్ వెనుకేసుకరావడంవల్లే మనస్తాపం చెంది పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మరో వైపు జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న ప్రశాంత్ రెడ్డి పార్టీ కష్టకాలం ఉన్న నేపథ్యంలోనూ హైదారాబాద్ కు పరిమితం అయ్యారని క్యాడర్ రగిలిపోతుంది.
మంత్రి గా ఐదేళ్లు జిల్లాలో చక్రం తిప్పిన ఆయన పవర్ పోవడంతో జిల్లా సంగతి ఎలా ఉన్నా బాల్కొండ సెగ్మెంట్ క్యాడర్ కు సైతం అందుబాటులో ఉండలేకపోతున్నారు. అందుకే ఆయా మండలంలో ద్వితీయశ్రేణి నేతలు ఒక్కోరు పార్టీ నుంచి జారుకుంటున్నారు.
కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో చేరికల మీద దృష్టిపెట్టింది లోకల్ బాడీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలస ల మీద ఫోకస్ పెట్టింది.
అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఘోర పలితాలవచ్చిన నేపథ్యంలో కనీసం లోకల్ బాడి ఎన్నికల్లో నైన సానుకూల ఫలితాలు సాధించాలనే పట్టుదల బాల్కొండ సెగ్మెంట్ అధికార పార్టీ నేతల్లో ఉంది అదీగాక రాష్త్రంలో ఈ సెగ్మెంట్ కు రాని విధంగా మూడు కార్పొరేషన్ ఛైర్మెన్ పోస్టులు
ఈ సెగ్మెంట్ కు వచ్చాయి. ఇంచార్జ్ సునీల్ రెడ్డి తో పాటు కార్పొరేషన్ ఛైర్మెన్ లు అనిల్ ,మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లకు పార్టీ బలోపేతం అగ్ని పరీక్షగా మారింది.
