ఆసుపత్రి లోపల పిల్లలు,…..ఆరు బయట వాహనాలు మాయం ? అడుగుపెట్టాలంటేనే భయ పడుతున్న రోగులు ……..అపహాస్యం అవుతున్న భద్రత..
మెడికల్ కాలేజీ కి అనుబంధంగా ఉండే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులో వైద్య సేవలసంగతి ఎలా ఉన్న భద్రతా వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. పటిష్టమైన వ్యవస్థ అందుబాటులో ఉన్నాసరే ఆసుపత్రిలో భద్రతా అపహాస్యం అవుతుంది.
ఇదివరకు రెండుమూడు వందలు దాటని రోగులు ఇప్పుడు రెండు వేలకు చేరింది. విస్తృతమైన వైద్య సేవలు అందుతున్నాయి అధునాత వైద్య పరికరాలు వచ్చాయి. ప్రసవాలు శస్త్ర చికిత్సల్లో ఆసుపత్రి అనతి కాలం లోనే ఖ్యాతి గడించింది.
అంతా బాగుందని ఆసుపత్రి నిర్వహణ అధికారులు గర్వంగా చెప్తున్నా భద్రత వైఫల్యాలవిషయంలో తెల్ల మొఖాలు వేయక తప్పని దుస్థితి. వైద్య సేవలకోసం వచ్చే రోగులు వారి సహాయంగా వచ్చే వారి తో నిత్యం రద్దీగా ఉండే సర్కార్ దవాఖాన లో నేరస్తులకు సైతం సురక్షితమైన అడ్డాగా మారింది.
ఆసుపత్రి లోపల బయట పోలీసు క్యాంప్ లున్నాసరే నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. లోపల ఉండే చిన్నారులు బయట ఉండే వాహనాలు ఇట్టే మాయం చేస్తున్నారు. వరుసగా ఘటనలు ఆసుపత్రి కి వచ్చే రోగులనే కాదు వారి వెంట వచ్చే వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రైవేట్ సెక్యురిటీ తో పాటు ఎమ్ ఎల్ సి కేసు పర్యవేక్షణ కోసంస్థానిక పోలీసులు గేట్ వద్ద పరిసరాల్లో స్పెషల్ పోలీసులు ఇలా మూడంచెల రక్షణ వ్యవస్థ ఉన్నాసరే నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయంటే ఎక్కడ వైఫల్యాలున్నయో యంత్రాంగం గుర్తించలేక పోతుంది. వివిధ వైద్య సేవల కోసం .
వేల సంఖ్యలో రోగులు వారి సహాయకులలో అబద్రత వెంటాడుతుంది రోగులు, లేదంటే వారి సహాయకుల ముసుగులో ఆసుపత్రి లోకి చొరబడుతున్న నేరస్తులను గుర్తించడంలో భద్రత వ్యవస్థ చేతులెత్తేసింది.గత రెండు నెలలోనే ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చి కిడ్నప్ లకు గురయ్యారు..
ఇటీవల ఆసుపత్రి లో చికిత్స కోసం వచ్చిన ఓ దంపతులు రాత్రి కావడంతో ఆసుపత్రి ఆవరణలో తన ముగ్గురు పిల్లలను పక్కలో పెట్టుకొని నిద్రించారు.ఘడ నిద్రలోకి జారుకున్నా తల్లిదండ్రులను గమనించిన ముగ్గురు అపరిచితులు పక్కలోనుంచి సంవత్సరం బాలుడితో కిడ్నాప్
ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. చివరికి సాంకేతిక వ్యవస్థ సహాయంతో కిడ్నప్ ఘటన ను 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు వెంటాడి చివరికి మహారాష్ట లో నిందితులను పట్టుకున్నారు ఆసుపత్రి లోపల ఎలా ఉంటె బయట సంగతి చెప్పే అవసరం లేదు ఆసుపత్రి కి వచ్చే వారి వాహనాలు క్షణాల్లో మాయం అవుతున్నాయి.
నిత్యం రోగులు, వారి సహాయకులకు చెందిన ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, పర్సులు, ఆభరణాలు, నగదు ఇలా అనేక రకాలుగా దొంగతనాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి అక్కడి భద్రత వ్యవస్థ కూడా ఇవన్నీ మాములే అన్నట్లుగా బాధితులతో వ్యవహరిస్తున్నారు.
ఇంత వరుస ఘటనలు పునరావృతం అవుతున్న, .
సెక్యూర్టీ లోపం…
నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో పోలీస్ భద్రత సిబ్బంది, సెక్యూర్టీ వ్యవస్థ లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నా యనే విమర్శలున్నాయి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని రోగుల కుటుంబాలు వాపోతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే సెక్యూర్టీ సిబ్బంది రోగులు, వైద్యులు, సిబ్బంది భద్రత గురించి అంతగా పట్టించుకోవడం లేదనేవాదన ఉంది సెక్యూరిటీ సిబ్బంది కంట పడకుండా విలువైన వస్తువులు బయటకు తరలిస్తున్నారు. తరచుగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగుల భద్రత గాలిలో దీపంగా మారింది.
