ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన సంఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ మశేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…
గణేష్,రాయుడి రాజు,మత్తు రాజు లు కలిసి ద్విచక్ర వాహనంపై కాంటేశ్వర్ బైపాస్ నుంచి దుబ్బ వైపు వెళ్తున్నా సమయంలో కాంటేశ్వర్ బైపాస్ నుంచి అర్సపల్లీ వైపుగా వెళ్తున్న లారి అతి వేగంగా ద్విచక్ర వాహనం ను ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు.
