జీవితంపై విరక్థితో రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన కోరుట్ల రైల్వే పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.కోరుట్ల మండలంలోని యాకిన్పూర్ గ్రామానికి చెందిన చిట్యాల నరేష్(41).
వృతి రీత్యా వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నారు. నరేష్ చిన్న నాటి నుంచి మానసిక అనారోగ్యం పాలవుతున్నారు.అందుకు నరేష్ కు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు.
ఈ మేరకు సోమవారం మానసిక ఆందోళనకు గురై కోరుట్ల రైల్వే పరిధిలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.