చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన మోగ్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మోగ్పల్ మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ నరసయ్య(35).
వృతి రీత్యా సోమవారం ఉదయం చేపలు పట్టడానికి సింగంపల్లీ గ్రామ శివారులోని కొచ్చే చెరువుకు వెళ్ళాడని పేర్కొన్నారు.చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కాళ్ళు,చేతులు చేపల వలలో చిక్కుకుని నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగాధర్ పేర్కొన్నారు.