అంబర్పేట నియోజకవర్గం బాగ్ అంబర్పేట్ డివిజన్ పోచమ్మ బస్తి ,కురుమ బస్తీలో ఈరోజు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు మరియు కార్పొరేటర్ శ్రీమతి పద్మ వెంకట్ రెడ్డి గారు కలిసి పాదయాత్రలో నిర్వహించారు.
సిసి రోడ్డు గురించి ప్రధానంగా చర్చించి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ అవసరం ఉంటుందో అక్కడ పని పూర్తి చేసి, రోడ్డు ఎస్టిమేషన్ వర్క్ కూడా చేయాలని అధికారులకు తెలిపారు.
స్వచ్ఛమైన మంచినీరు ప్రతిరోజూ ప్రజలకు అందించాలని వాటర్ వర్క్స్ బోర్డ్ అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు.
అలాగే వీధిలో వీధి దీపాలను పరిశీలించి ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో అక్కడ మరమ్మతులు చేయించి, వీధి దీపాలు లేనిచోట కొత్త వాటిని బిగించాలని అధికారులను ఆదేశించారు.
ఇందులో భాగంగా బిఆర్ఎస్ నాయకులు బొట్టు శ్రీను గారి తల్లి గారికి ఆక్సిడెంట్ అవ్వడం వల్ల వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే గారు.
ఈ కార్యక్రమంలో AMHO హేమ లత గారు, ఎలక్ట్రిసిటీ ఏఈ సౌమ్య గారు, జిహెచ్ఎంసి డిఈ ప్రవీణ్ గారు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి గారు, వాటర్ వర్క్స్ అధికారి మజీద్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారు , బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
