పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
ఎమ్మెస్సీ ఫారం కు చెందిన మహమ్మద్ ఖాసిం (71). సోమవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్ళే క్రమంలో రైలు పట్టాలు డాటుచుండగా గుర్తుతెలియని రైలు కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడం మృతి చెందాడు.
స్థానిక సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలు పోస్టుమార్టం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయి రెడ్డి పేర్కొన్నారు.
