ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నగరంలోని ఆర్సపల్లి లో శనివారం చోటు చేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని నిజాం కాలానికి చెందిన అన్వర్(42).
ఆర్సపల్లి బైపాస్ నుంచి కూరగాయల మార్కెట్ కు వెళ్ళే మార్గ మధ్యంలో ఆగివున్న లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
